కరీంనగర్ · August 15, 2026

జమ్మికుంటలో వైభవంగా వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

గజమాలతో ఘన సత్కారం, ప్రత్యేక పాట ఆవిష్కరణ

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 15: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి హనుమాన్ చౌరస్తా వద్ద అత్యంత వైభవంగా జరిగాయి. కూతాడి తిరుపతి, బొంగోని వీరన్న, పంజాల అజయ్, మర్రి రామ్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రణవ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హనుమాన్ చౌరస్తా ప్రాంగణం పూలమాలలు, నాయకుల సందడితో కోలాహలంగా మారింది.ఈ వేడుకల్లో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ దేశిని స్వప్న కోటి ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణవ్ బాబు ప్రత్యేక జన్మదిన గీతాన్ని ఆయన స్వయంగా ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రణవ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆయనను భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా దేశిని కోటి మాట్లాడుతూ ప్రణవ్ బాబు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, పేదల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ అండగా నిలుస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇతర కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడే తత్వం ప్రణవ్ బాబుదని, యువతకు, బడుగు వర్గాలకు ఆయన నిరంతరం అండగా ఉంటున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, దుబ్బ మల్లన్న దేవస్థాన చైర్మన్ ముద్దమల్ల రవి, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు చంద రాజు, శ్రీపతి నరేష్, యాట్ల సునీత అశోక్, ఒగ్గు రమేష్, మాచర్ల రాజు, పొనగంటి విష్ణు, ఎగిత సుజాత అశోక్, పాతకాల మౌనిక అనిల్, బత్తుల లక్ష్మణ్, మహిళా కాంగ్రెస్ నేతలు తోట స్వప్న, పిడుగు భాగ్యలక్ష్మి, యూత్ కాంగ్రెస్ నాయకులు బొడిగె శ్రీకాంత్, రాజ్‌కుమార్, ఇతర సీనియర్ నాయకులు ఎండి సలీం, ఎగ్గని శ్రీనివాస్, టెంకురాల కిషోర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor