జమ్మికుంట తహసీల్దార్ జి. సుధాకర్‌కు ఘన సత్కారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం ప్రదానం

0
IMG-20260815-WA0095

కరీంనగర్,వి90 న్యూస్,ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జమ్మికుంట తహసీల్దార్ జి. సుధాకర్ ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించిన వేడుకల్లో, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ , జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.రెవెన్యూ శాఖలో విశిష్ట సేవలు అందించడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో, భూ సమస్యల పరిష్కారంలో చూపిన చొరవకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తహసీల్దార్ జి. సుధాకర్ మాట్లాడుతూ అవార్డు రావడం పట్ల తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. తన విధి నిర్వహణకు సహకరించిన కార్యాలయ సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *