కరీంనగర్ · August 15, 2026

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ వేడుకల సందర్భంగా పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా 12వ వార్డులోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పట్టణ ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, ఆర్‌ఐ భాస్కర్లతో పాటు గౌరవ కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor