కరీంనగర్ · August 15, 2026

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 15: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. అనంతరం అక్కడికి చేరిన నాయకులు, సిబ్బంది, రైతులు అంతా కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ స్వప్న సదానందం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ నిరంతరం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు తమ కమిటీ శ్రమిస్తుందని స్పష్టం చేశారు.వేడుకల అనంతరం మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు, కార్యాలయ సిబ్బందికి చైర్‌పర్సన్ చేతుల మీదుగా నూతన దుస్తులను పంపిణీ చేశారు.

అలాగే వ్యాపారులు, హమాలీలు, రైతులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కార్యదర్శి మల్లేశం, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, కార్యదర్శి రాజా, మార్కెట్ సూపర్వైజర్లు బాబా, సురేందర్, కమిటీ సభ్యులు, వ్యాపారులు, రైతులు , హమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor