కరీంనగర్ · August 15, 2026

జమ్మికుంట మున్సిపల్ అధికారులకు ‘ఉత్తమ ఉద్యోగి’ పురస్కారాలు: కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాల ప్రదానం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జమ్మికుంట మున్సిపాలిటీ మేనేజర్ జి. రాజిరెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏ. భాస్కర్ ‘ఉత్తమ ఉద్యోగి’ అవార్డులకు ఎంపికయ్యారు. కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వీరు ప్రశంసా పత్రాలను అందుకున్నారు.జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను వసూళ్లలో 100 శాతం లక్ష్యాన్ని సాధించి, వరుసగా రెండేళ్లపాటు రాష్ట్రాన్నే ప్రథమ స్థానంలో నిలబెట్టడంలో మేనేజర్ రాజిరెడ్డి, ఆర్‌ఐ భాస్కర్ కీలక పాత్ర పోషించి విశేష కృషి చేశారు. వీరి సమర్థవంతమైన సేవలను, అంకితభావాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించింది.

జిల్లా స్థాయిలో అరుదైన గౌరవం సాధించిన ఈ అధికారులను జమ్మికుంట మున్సిపల్ చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ప్రత్యేకంగా అభినందించారు. వీరి సేవలు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని కొనియాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు, స్థానిక నాయకులు రాజిరెడ్డి, భాస్కర్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor