కరీంనగర్ · August 17, 2026

జమ్మికుంటలో విషాదం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 17: జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గుల్లి సంపత్ (50) అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. గత కొంతకాలంగా ఇంట్లోని తల్లిదండ్రులు, తమ్ముడితో నెలకొన్న వివాదాలు, వారి వేధింపుల వల్లే తాను ఈ దారుణ నిర్ణయం తీసుకుంటున్నట్లు మృతుడు రాసిన సూసైడ్ నోట్ అక్కడ లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor