అనాథ వృద్ధుని మృతి: ఆచూకీ కోసం జమ్మికుంట పోలీసుల విజ్ఞప్తి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 17: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద తీవ్ర అనారోగ్యంతో పడివున్న సుమారు 70 నుండి 75 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తుతెలియని వృద్ధుడిని స్థానికులు గమనించి వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించాడు. మృతునికి సంబంధించిన బంధువులు గానీ, ఆచూకీ తెలిసిన వారు గానీ వెంటనే జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

