కరీంనగర్ · August 19, 2026

జమ్మికుంటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం: శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 19: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం (బొమ్మల గుడి) వద్ద కరీంనగర్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేంద్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జమ్మికుంట మండలానికి చెందిన పలువురు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సేవా గుణాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేంద్ర మాట్లాడుతూ సమాజానికి నిత్యం సేవలు అందిస్తున్న ఫోటోగ్రాఫర్లు కేవలం కళాకారులు మాత్రమే కాకుండా, దృఢమైన సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉంటారని తెలిపారు.

ప్రతి ఏటా ఆగస్టు 19న వచ్చే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని పేర్కొంటూ, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, సభ్యులు రచ్చ గణేష్, బి.కె. వెంకన్న, విజయగిరి రాంబాబు, బిట్ల తిరుపతి, గండి రంజిత్ కుమార్, కొక్కుల శ్రీరాములు, కోటగిరి కుమార్, పంజాల గణేష్, భాస్కర్, సత్యం, పొనగంటి రాజు, పవన్ బండి, కృష్ణ, శివ సాయి, అంబాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor