కరీంనగర్ · August 20, 2026

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి: మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 20: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పిలుపునిచ్చారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు.దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందనే నమ్మకంతో రాజీవ్ గాంధీ వారికి అనేక అవకాశాలు కల్పించారని సుహాసిని కొనియాడారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య నిర్మాణంలో యువతకు కీలక భాగస్వామ్యం కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టడమే కాకుండా, గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర మహత్తరమైనదని పేర్కొన్నారు.

ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన ఆయన మార్గంలో పయనిస్తూ, ప్రజాసేవే లక్ష్యంగా యువత ముందుకు సాగాలని కోరారు.ఈ వేడుకల్లో హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లురి కిరణ్, పట్టణాధ్యక్షుడు మేకల తిరుపతి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పుల్ల రాధతో పాటు కౌన్సిలర్లు సమ్మయ్య, సొల్లు సునీత, మొగిలి, సందమల్ల పుణ్య, వెంకట్, జన్నోజు భాస్కర్, సీనియర్ నాయకులు సొల్లు బాబు, రాజిరెడ్డి, సమ్మిరెడ్డి, కుమారస్వామి, సంపత్, ఉప్పు శ్రీనివాస్, సందమల్ల బాబు, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor