కరీంనగర్ · August 20, 2026

జమ్మికుంట ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో కస్టమర్ అవగాహన సదస్సు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, బ్యాంకింగ్ సేవలపై కీలక సూచనలు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 20: జమ్మికుంట పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు , సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డిజిటల్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన సూచనలు చేశారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా నంబర్, ఏటీఎం పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్ , సీవీవీ వంటి అత్యంత రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. అపరిచిత ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింక్‌లు , గుర్తుతెలియని యాప్‌ల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.అలాగే ఏటీఎం కార్డు వినియోగంలో పాటించాల్సిన నిబంధనలు, కార్డు పోయిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు , ఖాతాలో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే తక్షణమే బ్యాంకును సంప్రదించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీనితో పాటు బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల రుణాలు, గోల్డ్ లోన్ల వివరాలను తెలుపుతూ, రుణం పొందేముందు వడ్డీ రేటు, కాలపరిమితి, చెల్లింపు వాయిదాలు , ఇతర నిబంధనలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు.2018లో ప్రారంభమైన జమ్మికుంట ఇండియన్ బ్యాంక్ శాఖ ప్రస్తుతం రూ.200 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలతో ఖాతాదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ విజయవంతంగా సేవలు అందిస్తోందని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్, సిబ్బంది గణేష్, శ్రీకాంత్, హర్షలతో పాటు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor