కరీంనగర్ · August 21, 2026

జమ్మికుంటలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి: తహసిల్దార్‌కు బిజెపి వినతి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 21: జమ్మికుంట మండలంలో ఇసుక కొరత తీవ్రమవ్వడంతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలంలో తక్షణమే అధికారికంగా ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా బిజెపి నాయకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు దొంతరవేన రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. జమ్మికుంట మండల పరిధిలో ఇసుక దొరక్కపోవడం వల్ల సామాన్య ప్రజలు గృహ నిర్మాణ పనులు చేపట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సొంత ఇళ్ల నిర్మాణాలే కాకుండా, ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులు కూడా ఇసుక కొరత కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి వెంటనే జమ్మికుంట మండలంలో ఇసుక రీచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.మండలానికి ఇసుక రీచ్‌ను మంజూరు చేసి ఏర్పాటు చేయకపోతే బిజెపి కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజలను మమేకం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని వినతిపత్రం ద్వారా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, సర్పంచులు కేవిడే కుమార్ స్వామి, గరికడి శ్రీధర్, ముఖ్య నాయకులు పుల్లూరి ఈశ్వర్, నాగపురి విక్రమ్, కొట్టాల మల్లేష్, భీమిలి వెంకటేశ్వర్లు, శెట్టి హరీష్, కనబోయిన సమ్మయ్య, భీమిలి కిషన్ రావు, గరిగంటి శ్రీధర్, లింగమూర్తి, శ్రీనివాస్, ఆవుల తిరుపతి, అశోక్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor