నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు కొగిలా మహేష్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 22: దళితబంధు సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జమ్మికుంట పట్టణానికి చెందిన కోలుగూరి నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర దళితబంధు సాధన సమితి అధ్యక్షులు కొగిలా మహేష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు సాధన సమితి కమిటీలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను ప్రతి గ్రామంలోనూ ఎండగడతామని, దళిత సంఘాలను కలుపుకొని పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. తన నియామకంపై నరేష్ మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు రెండో విడత నిధులు మంజూరు చేయాలని గత రెండేళ్లుగా నిరంతరం అనేక పోరాటాలు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఉద్యమించే గొప్ప అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు, అలాగే తన నియామకానికి పూర్తి సహకారం అందించిన రాష్ట్ర అధ్యక్షుడు కొగిలా మహేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

