కరీంనగర్ · August 23, 2026

సమాజంలో అసమానతలు తొలగకుండా రిజర్వేషన్లను ఎత్తివేయడం సామాజిక న్యాయానికి విరుద్ధం: శంకర్ మాదిగ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 23: దేశంలో కుల వివక్ష, సామాజిక అసమానతలు పూర్తిగా రూపుమాపకముందే రిజర్వేషన్లను తొలగించాలని చూడటం రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడమేనని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. రిజర్వేషన్లు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల వచ్చినవి కావని, అవసరమైనంత వరకు వాటిని కాపాడుకోవడం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల బాధ్యత అని స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులు వెనుక నుండి కుట్రలు పన్నుతున్నాయని, ఈ చర్యలను బహుజన సమాజం సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.దేశం అభివృద్ధి చెందుతోందని చెప్తున్న పాలకులు, పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఆర్థిక భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నా, అవి సామాన్య ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయో ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి సంబంధించి చేవెళ్ల డిక్లరేషన్‌ను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ఇప్పటివరకు దళిత యువతకు అందించిన సబ్సిడీ రుణాలు, కల్పించిన ఉపాధి అవకాశాలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దళితుల ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత కోసం తమ సంస్థ పోరాటాన్ని కొనసాగిస్తుందని, రిజర్వేషన్ల పరిరక్షణకై తెలంగాణ నుండి పోరాట కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor