కరీంనగర్ · August 23, 2026

హుజురాబాద్‌లో బీఆర్ఎస్, బీజేపీలకు బిగ్ షాక్: కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 23: కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిన నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొకవైపు అభివృద్ధిని ప్రభుత్వం సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందని కొనియాడారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న ప్రణవ్ నాయకత్వంపై నమ్మకంతోనే తాము కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు.అనంతరం వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, నియోజకవర్గ ప్రజల ప్రతి కష్టంలో తోడుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి హుజురాబాద్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు సదానందం, మండల అధ్యక్షుడు పరశురామ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, డివైసి సెక్రటరీ సజ్జు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాగర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్, వివిధ వార్డు సభ్యులు , సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor