కరీంనగర్ · August 24, 2026

జమ్మికుంట మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 24: జమ్మికుంట మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో 27 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులకు హుజురాబాద్‌కి చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు, సామాజిక కార్యకర్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ములుగు ప్రశాంత్ కుమార్ , కమిషనర్ గుట్టల మల్లికార్జున్ కలసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయునిగా రిటైర్ అయిన తర్వాత కూడా తన సొంత పెన్షన్ డబ్బులతో తల్లి పేరున ట్రస్ట్‌ను స్థాపించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, పేదలకు సేవ చేయడం ఎంతో గర్వకారణమని కొనియాడారు.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను గు గుర్తించి సహాయం అందించినందుకు ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో చేపటే సేవ కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం కూడా ఉంటుందని ప్రకటించారు.అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి వెన్నెముక లాంటి వారని అభివర్ణించారు. ప్రతిరోజూ ఉదయమే వీధులను, డ్రైనేజీలను శుభ్రపరుస్తూ, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తూ ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా నివారిస్తున్న వీరి సేవలు అత్యంత అమూల్యమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గుర్రం కావ్య పరశురాములు, శీలం శ్రీనివాస్, కొల్లూరు సురేష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ తులసి లక్ష్మణమూర్తి, కార్యాలయ సిబ్బంది , పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor