కరీంనగర్ · October 9, 2026

రాహుల్, ప్రియాంకల అక్రమ అరెస్టును ఖండిస్తూ జమ్మికుంటలో యూత్ కాంగ్రెస్ ధర్నా: రాజ్యాంగ పరిరక్షణకే మా పోరాటమని సజ్జద్ మహమ్మద్ వెల్లడి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 09: కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాడ్రాలపై జరిగిన దాడి, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సజ్జద్ మహమ్మద్ ఆధ్వర్యంలో జమ్మికుంటలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జద్ మహమ్మద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పోరాటం ఏ ఒక్క పార్టీ లేదా వ్యక్తి కోసం కాదని, కేంద్రంలో అపహాస్యానికి గురవుతున్న రాజ్యాంగ పరిరక్షణ కోసమేనని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ, సామాన్య పౌరుల ఓటు హక్కును హరించే స్థాయికి దిగజారిందని ఆయన విమర్శించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ అప్రజాస్వామిక చర్యలకు బాధ్యత వహిస్తూ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై అక్రమ అరెస్టులు, దాడులు కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజాస్వామ్య రక్షణ కోసం జమ్మికుంట వేదికగా పోరాటాన్ని మరిన్ని రూపాల్లో ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ చందా రాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్, దౌలత్, ప్రధాన కార్యదర్శులు శనిగరపు తరుణ్, పంజాల అజయ్, పాతకాల రమేష్, NSUI జిల్లా కార్యదర్శి పర్వేజ్, మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI, సేవాదళ్ నాయకులు బూడిగే శ్రీకాంత్, రాచపల్లి సాగర్, వేవునూరి వినయ్, అకినపల్లి శ్యామ్ కళ్యాణ్, రామకృష్ణ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor