శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు
ఇల్లందకుంట,V90 NEWS, మే 08: ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మంత్రి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లెల్ల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి కనుమల్ల రామకృష్ణ, సీనియర్ నాయకులు కనుమల్ల సంపత్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు. విద్యార్థి దశలోనే ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి విద్యార్థుల సమస్యలపై పోరాడారని, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని గుర్తుచేశారు. ఉమ్మడి కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కాకుండా, పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ధీశాలి అని ప్రశంసించారు.ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పొన్నం ప్రభాకర్‌కు మండల ప్రజల తరపున వారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పెద్ది శివకుమార్, కోడం రజిత, రఘుపతి రెడ్డి, ఆరే రమేష్ రెడ్డి, గూడెపు ఓదెలు, గొడుగు మానస, గుండారపు సాయికుమార్, మీస రాజయ్య, మేడద తిరుపతి రెడ్డి, గోరుకుంట్ల స్వామి, మూడేళ్ల రమేష్, మారేపల్లి వేణు, మంకు ఐలయ్య, భోగం పృథ్వీరాజ్, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, జక్కు కుమారస్వామి, శాతాల మధు, మోతుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
