కరీంనగర్ · June 13, 2026

కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో “మన బడి – మన బాధ్యత” కార్యక్రమం: పది తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ ఉంటుందని మట్ట పవన్ రెడ్డి వెల్లడి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూన్ 13: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేవా సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో “మన బడి – మన బాధ్యత” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని తరగతి గదులను, పాఠశాల ప్రాంగణాన్ని బీజేపీ శ్రేణులు స్వయంగా తుడిచి, చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా సహకారం అందించాలని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు పవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వాటి ప్రగతికి తోడ్పడాలని కోరారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థుల కోసం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. గత విద్యా సంవత్సరంలో విజయవంతంగా నిర్వహించినట్లుగానే, ఈ విద్యా సంవత్సరంలో కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఒకే రోజు భారీ ఎత్తున సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు పవన్ రెడ్డి స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ సేవా భావం, సుపరిపాలన స్ఫూర్తితో సమాజ హితం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాసరెడ్డి, బండి సాంబరాజు, బచ్చల రాజమహేందర్, కంచం రాజయ్య, మట్ట అరవింద్ రెడ్డి, మాడిజోడి రవి, సామాను రామారావు, మల్లయ్య తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పాఠశాల పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor