జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ దూరవిద్య ప్రవేశాలు

0
IMG-20260704-WA0018

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 04: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ద్వారా డిగ్రీ దూరవిద్య ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైనట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎస్.ఓ. కుమార్, కోఆర్డినేటర్ డాక్టర్ కే. రాజేంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గానూ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో చేరాలనుకునే ఆసక్తి గల విద్యార్థులు ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీ (07-08-2026) లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. కొత్తగా చేరేవారితో పాటు ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు కూడా తమ వార్షిక ట్యూషన్ ఫీజును నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రవేశాలు మరియు ఇతర పూర్తి వివరాల కోసం విద్యార్థులు 7382929775 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చని పేర్కొంటూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed