కరీంనగర్ · July 5, 2026

జమ్మికుంటలో ఘనంగా వనమహోత్సవం: మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 05: జమ్మికుంట పట్టణ మున్సిపల్ పరిధిలో వనమహోత్సవ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా విచ్చేసి స్వయంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని ప్రతి కౌన్సిలర్, ప్రతి పౌరుడు , మహిళలు తమ నివాస గృహాల ప్రాంగణాల్లో భాగస్వాములై తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.తల్లి మనకు జన్మనిస్తే, మనం నాటే మొక్కలు మనకు పునర్జన్మను ఇస్తాయని ఆయన ఈ సందర్భంగా ఒక చక్కని సందేశాన్ని అందించారు.

పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడం ఒక్కటే మార్గమని, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరారు.ఈ విజయవంతమైన పర్యావరణ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, చందా రాజులతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, బొళ్ళ సదానందం, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సి.ఎల్.ఆర్.పి (CLRP)లు, ఆర్.పి (RP)లు , స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor