తెలంగాణ · July 6, 2026

సమ్మక్క గద్దెల పరిసరాల్లో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్: వనమహోత్సవంలో పిలుపు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 06: జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవాపురం సమ్మక్క గద్దెల పరివాహక ప్రాంతంలో వనమహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మక్క గద్దెల పరిసరాల్లో ఉన్న విశాలమైన ప్రదేశంలో ఎక్కువగా అల్లనేరేడు, జాము వంటి పండ్ల మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. ఇలాంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా మూగజీవాలకు, పక్షులకు అవసరమైన ఆహారం లభిస్తుందని, అంతేకాకుండా కోతులు ఆహారం కోసం మానవ నివాస ప్రాంతాల్లోకి రాకుండా అడవుల్లోనే ఉండేలా నియంత్రించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పట్టణంలోని దుబ్బ మల్లన్న క్షేత్రం వద్ద, అలాగే ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే అక్కడల్లా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు.పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పేర్కొంటూ, పట్టణంలోని ప్రతి పౌరుడు, ప్రతి మహిళ తమ ఇళ్ల పరిసరాలలో భాగస్వాములై తప్పనిసరిగా మొక్కలు నాటాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ‘తల్లి జన్మనిస్తే.. మనం నాటే మొక్కలు మనకు పునర్జన్మను ఇస్తాయి’ అంటూ ఆయన పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేశారు. ఈ హరిత కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పాతకాల మౌనిక అనిల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, ఆర్పీ స్వరూప, అంగన్వాడీ టీచర్ శివ భారతి, ఆశా వర్కర్ స్వప్నలతో పాటు స్థానిక నేతలు, యువకులు రమేష్, సతీష్, సురేష్, అంజి, కమలాకర్, అజయ్, సాయికిరణ్, నందు, రాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor