ప్రియుడి కోసం భర్త సంపాదనతోనే సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య: అనకాపల్లిలో దారుణం

0
100599997

ఆంధ్రప్రదేశ్‌,వి90 న్యూస్,జూలై 06: అనకాపల్లి జిల్లా శ్రీరామపురంలో వివాహేతర సంబంధం కారణంగా ఒక ఘోర కలియుగ వింత, దారుణమైన ఘటన వెలుగుచూసింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో హైమా అనే మహిళ, భర్త అప్పలనాయుడును సుపారీ ఇచ్చి ఇంట్లోనే దారుణంగా హత్య చేయించింది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, భర్తను చంపడానికి ఆమె భర్త కష్టపడి సంపాదించిన డబ్బులనే హంతకులకు సుపారీగా వాడింది.
గంగాధర్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం వల్లే హైమా ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఈ దారుణ హత్య వల్ల వారి ఇద్దరు అమాయక పిల్లలు తండ్రిని కోల్పోయి అనాథలయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి, కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలైన హైమాతో పాటు ఆమె ప్రియుడు గంగాధర్, హత్యకు సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed