ఆంధ్ర ప్రదేశ్ · July 1, 2026

దేశంలోనే అత్యధిక పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 01: పింఛన్ల పంపిణీలో దేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు కొనియాడారు. బుధవారం వాడపాలెంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 41,500 మంది లబ్ధిదారులకు రూ.18.23 కోట్ల నిధులను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సమర్థవంతమైన నేతృత్వంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు కేవలం పింఛన్ల పంపిణీ కోసమే రూ.60 వేల కోట్లను ఖర్చు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఒకటో తేదీన సెలవు దినం వస్తే, ముందు రోజైన 31వ తేదీనే లబ్ధిదారుల చేతికి పింఛన్ డబ్బులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొనియాడారు. నియోజకవర్గంలో నేటి నుంచి కొత్తగా ‘స్పౌజ్’ కేటగిరీ కింద మరో 73 మందికి పింఛన్లు అందజేస్తున్నామని వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి ఐదేళ్ల సుదీర్ఘ కాలం తీసుకుందని విమర్శించిన ఆయన, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిందని గుర్తుచేశారు. అలాగే దివ్యాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన రోగులకు రూ.15 వేలకు పింఛన్ పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్లు అందించడానికి త్వరలోనే ప్రత్యేక కార్యాచరణను ప్రారంభిస్తామని, భవిష్యత్తులో కొత్తవారికి కూడా పింఛన్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భరోసా ఇచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor