జమ్మికుంటలో వీణవంక రోడ్డు ప్రధాన డ్రైన్‌ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 02: జమ్మికుంట పట్టణ పరిధిలోని వీణవంక రోడ్డు ప్రధాన డ్రైన్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో వరద నీరు భారీగా వస్తుండటంతో, ఆ నీరంతా పక్కనే ఉన్న 24వ వార్డులోకి ప్రవేశించి స్థానికులకు ఇబ్బందిగా మారిందని ఆయన ఈ సందర్భంగా గుర్తించారు.ఈ వరద నీరు నివాస ప్రాంతాల వైపు వెళ్లకుండా, నేరుగా నాయిని చెరువు మత్తడి వరకు సాఫీగా సాగిపోయేలా వీణవంక రోడ్డు వెంబడి కొత్త డ్రైన్ నిర్మించాల్సిన అవసరం ఉందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఈ నూతన డ్రైన్ నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకై త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మున్సిపల్ యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, టీపీఎస్ రాజ్ కుమార్, మున్సిపల్ ఏఈ వికాస్, ఆర్‌అండ్‌బీ ఏఈ తో పాటు స్థానిక వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

