క్రైమ్ · July 6, 2026

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య: నరాల్లోకి హార్పిక్ ఎక్కించి దారుణ హత్య

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

నిజామాబాద్,వి90 న్యూస్,జూలై 06: నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ (హార్పిక్) ఎక్కించి హత్య చేసింది.వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో ప్రశాంత్, సంధ్య అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే సంధ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై భర్త ప్రశాంత్ ఆమెను నిలదీయడంతో, అతడిని శాశ్వతంగా వదిలించుకోవాలని సంధ్య ఒక పక్కా స్కెచ్ వేసింది.పథకం ప్రకారం మొదట భర్త ప్రశాంత్‌కు ఆమె అతిగా మద్యం తాగించింది. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్న తర్వాత, సంధ్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ప్రశాంత్‌పై తీవ్రంగా దాడి చేసి, అనంతరం భవనం పై నుంచి కిందకు తోసేశారు. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ, అతడు ప్రాణాలతోనే కొట్టుమిట్టాడుతున్నాడు.ఎలాగైనా అతడిని చంపాలనే క్రూరమైన ఉద్దేశంతో సంధ్య ఇంట్లో ఉన్న హార్పిక్ లిక్విడ్‌ను ఒక సిరంజిలోకి తీసుకుంది. ప్రాణాలతో పోరాడుతున్న ప్రశాంత్ నరాల్లోకి ఆ విషపూరితమైన క్లీనర్‌ను నేరుగా ఎక్కించింది. శరీరంలోకి హార్పిక్ కెమికల్ చేరడంతో ప్రశాంత్ కొద్దిసేపటికే అత్యంత దారుణమైన స్థితిలో తల్లడిల్లుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor