ట్రైనీ కలెక్టర్ పి. హరిప్రసాద్‌కు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఘన స్వాగతం
వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన అధికారులు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 07: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్ పి. హరిప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) , మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆయనకు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానం చేసి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ట్రైనీ కలెక్టర్‌ను అధికారులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, అందరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామితో పాటు, మేనేజర్ జి. రాజిరెడ్డి , కౌన్సిలర్లు , మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

