కరీంనగర్ · July 9, 2026

జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఓటర్ల హెల్ప్‌లైన్: 2002 ఓటర్ లిస్టు ఆధారంగానే నమోదు చేసుకోవాలని పిలుపు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 09: జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీ 27వ వార్డులో బీజేపీ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక హెల్ప్‌లైన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, వార్డు కౌన్సిలర్ శీలం శ్రీనివాస్ పలు పోలింగ్ బూత్‌లను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. పాత ఓట్లు ఇకపై పనిచేయవని, అధికారులు 2002 ఓటర్ల జాబితా ఆధారంగానే మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టారని వారు స్పష్టం చేశారు. ఆ జాబితా ఆధారంగానే ప్రభుత్వం అందజేసిన ఫారాలను పూర్తి చేసి, ఫోటో జత పరిస్తేనే కొత్త ఓటు హక్కు లభిస్తుందని, లేనిపక్షంలో ఓటు వచ్చే అవకాశం ఉండదని వారు ప్రజలకు వివరించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని గమనించి బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని, ఇందుకోసం బీఎల్ఓలు, బీఎల్ఏ-2లు ఎప్పటికప్పుడు సమన్వయంతో సమాచారాన్ని అందించాలని కోరారు.
ఇదే సమయంలో నియోజకవర్గంలో లేని వారి పేర్లతో దొంగ ఓట్ల నమోదుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటిని ముసాయిదా ఓటర్ల జాబితా నుండి ఖచ్చితంగా తొలగిస్తామని వారు హెచ్చరించారు. అక్రమ ఓట్ల నమోదును అడ్డుకునేందుకు బీజేపీ బీఎల్ఏ-2 ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, 27వ వార్డు కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, స్వరూప, బీఎల్ఏ-2 ప్రతినిధి కనుబోయిన బద్రి, మహిళా మోర్చా అధ్యక్షురాలు చుక్కల గంగాభవాని, వెంకటరాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor