కరీంనగర్ · July 11, 2026

జమ్మికుంటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 11: జమ్మికుంట పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించాయి. పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా తొలుత కొత్తపల్లి హనుమాన్ దేవాలయంలో బండి సంజయ్ పేరు మీద ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించారు. అనంతరం గాంధీ చౌరస్తాలో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఓబిసి మోర్చ ఆధ్వర్యంలో ప్రజలకు పండ్లు పంపిణీ చేయగా, యువ మోర్చ అధ్యక్షులు తుర్పాటి శంకర్ నేతృత్వంలో సుమారు 20 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆబాది జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో కైలాసకొటి గణేష్, పంజాల అనిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, ఓబిసి జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, కొలకాని రాజకుమారి, గణపతి తదితరులు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, చిన్ననాటి నుంచే RSS, బిజెపి పార్టీలలో చురుకైన కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ, ఎన్నో సార్లు జైలుకు వెళ్ళి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించి, నేడు కేంద్ర మంత్రిగా ఎదిగిన ఆయనకు భవిష్యత్తులో తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొండగట్టు ఆంజనేయస్వామి, అమ్మవార్లు మరింత శక్తిని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో కౌన్సిలర్ గుర్రం కావ్య పరుశురాం, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాసకొటి గణేష్, రాజేష్ ఠాకుర్, అడువాల కుమార్, కేస స్వరూప, నిరూపరాణి, ఆకుల తిరుపతి, పోచయ్య, వొల్లాల సతీష్, రాకేష్ ఠాకూర్, రాయబారపు సురేష్, కొండ్లె నగేష్, అప్పం మధు, శ్రీవర్తి ప్రవీణ్, గట్టు సాయిరాం, బోనగిరి ప్రణిత్, ఉడుగుల మహేందర్, పొనగంటి రవి, అప్పాల రవిందర్, ముకుందా సుధాకర్, సిరియాల విజయ్, యాంసాని సమ్మయ్య, ఇటుకాల స్వరూప, కనుమల్ల లక్ష్మి, పనికారి రమేష్, తాటికంటి మల్లేష్ లతో పాటు పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor