కరీంనగర్ · June 13, 2026

జమ్మికుంటలో బీఆర్ఎస్ సభ్యత్వ, ఓటర్ నమోదు అవగాహన సదస్సు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట, వి90 న్యూస్, జూన్ 13: జమ్మికుంట పట్టణ పరిధిలోని ఎంపిఆర్ (MPR) గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ (SIR) ఓటర్ నమోదు కార్యక్రమాలపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జ్ రాకేష్ రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వ హయాంకు, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ఇందుకోసం ప్రతి పల్లెలోనూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములై పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని కోరారు.సరికొత్త ఉత్సాహంతో సాగిన ఈ సదస్సులో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ మున్సిపాలిటీల మాజీ ఛైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, యూత్ నాయకులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, పుర ప్రముఖులు , బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor