పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్నిప్రమాదం: బూడిదైన 4,000 ఈవీఎంలు
పశ్చిమ బెంగాల్/కోల్‌కతా,వి90 న్యూస్,జూన్ 12: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీపుర్‌లోని తొమ్మిది అంతస్తుల ప్రభుత్వ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, అక్కడ భద్రపరిచిన సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో దహనమైన ఈవీఎంలన్నీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఈ భారీ ప్రమాదంపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

