తమిళనాడు రాజకీయాల్లో నూతన అధ్యాయం: ముఖ్యమంత్రిగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం
తమిళనాడు,వి90న్యూస్ డెస్క్ మే 09: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే (TVK) అధినేత విజయ్‌కు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో, రేపు ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే అట్టహాసమైన కార్యక్రమంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే మరియు ఐయూఎంఎల్ వంటి కీలక పార్టీలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. సంఖ్యాబలం పరంగా చూస్తే, టీవీకేకు స్వయంగా ఉన్న 107 స్థానాలకు తోడు కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 మరియు ఐయూఎంఎల్ 2 స్థానాల మద్దతు లభించడంతో కూటమి మొత్తం బలం 120కి చేరుకుంది. దీంతో మెజారిటీ మార్కును అందుకున్న విజయ్, ప్రజా క్షేత్రంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు భారీ ఎత్తున అభిమానులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉండటంతో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
