కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, అక్టోబర్ 02: సిరిసేడు గ్రామానికి సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల-కుమార్ దంపతులు వైకుంఠ రథాన్ని అందజేశారు. సర్పంచ్ తన ప్రాణానికి ప్రాణమైన సోదరుడు, తనను ప్రజాసేవలో చూడాలని బలంగా కోరుకున్న కీ.శే. రేణుకుంట్ల సంపత్ జ్ఞాపకార్థం ఈ వైకుంఠ రథాన్ని గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, తన సోదరుడు నేడు ఈ లోకంలో లేకపోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలతో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి ముందుంటానని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు.

గ్రామానికి వైకుంఠ రథాన్ని అందజేసినందుకు గాను గ్రామ ప్రజలు సర్పంచ్ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవలో వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంశీ, పంచాయతీ కార్యదర్శి శ్రీను, కారోబార్ రాంబాబు, మాజీ ఎంపీటీసీ చిన్నరాయుడు, నాయకులు జేకే, దామోదర్, ముస్తఫా, షఫీ, శేఖర్, దాస్, అంజి, సంపత్, చిరంజీవి, జానీ, సాయి, వార్డు సభ్యులు, యువకులు , గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

