కరీంనగర్ · June 19, 2026

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో రాహుల్ గాంధీ జన్మదిన ప్రత్యేక పూజలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూన్ 19: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి రాహుల్ గాంధీ పేరిట అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల కాపాడటం, సామాజిక న్యాయం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ గాంధీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సంక్షేమం, పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పడుతున్న తపన అమోఘమని కొనియాడారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా చారిత్రాత్మక పాదయాత్రలు చేపట్టి, నేడు సామాన్య ప్రజల బలమైన గొంతుకగా నిలిచారని ప్రశంసించారు.యువతలో చైతన్యం నింపుతూ, దేశ భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ సమాన అవకాశాలు కలిగిన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారని నాయకులు స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు. ఈ శుభ సందర్భంగా రాహుల్ గాంధీకి ఆ సీతారామచంద్రస్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించి దేశాన్ని నడిపించే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor