టెక్నాలజీ · July 11, 2026

అవోపా పుప్పాలగూడ శాఖ ఆధ్వర్యంలో మణికొండ ప్రభుత్వ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి,వి90 న్యూస్,జూలై 11: మణికొండ పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల డిజిటల్ విద్యాబోధన కొరకు అవోపా (AVOPA) పుప్పాలగూడ శాఖ అద్భుతమైన విరాళాన్ని అందించింది. అవోపా పుప్పాలగూడ కుటుంబ సభ్యులు పాఠశాలకు శాంసంగ్ 43 ఇంచుల స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీని అందజేశారు. ఈ కార్యక్రమానికి అవోపా రాష్ట్ర అధ్యక్షుడు మల్లిపెద్ది ముఖ్య అతిథిగా హాజరై, పుప్పాలగూడ యూనిట్ సభ్యులతో కలిసి ఈ స్మార్ట్ టీవీని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర అన్న, బాలలత ఐఏఎస్ ల స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాలను ఉపాధ్యాయులు, విద్యార్థులతో పంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుండి వస్తారని, అందువల్ల ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత ఎక్కువ బాధ్యతతో, కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిల్లల్లో ఉన్నత లక్ష్యాలను పెంపొందించడానికి నిరంతరం స్ఫూర్తిదాయకమైన కథలను వారికి వినిపించాలని ఉపాధ్యాయులను కోరారు.అవోపా పుప్పాలగూడ యూనిట్ అధ్యక్షుడు దారం వేణు మాధవ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు , విద్యార్థులు ఈ స్మార్ట్ టీవీని కేవలం విద్యాబోధనకే కాకుండా, పాఠశాలలో జరిగే వివిధ రకాల సాంస్కృతిక, జ్ఞానసంబంధిత కార్యక్రమాలకు సైతం సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.పాఠశాల ఉపాధ్యాయులందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పుప్పాలగూడ యూనిట్ ప్రధాన కార్యదర్శి దారం భానుచందర్, కోశాధికారి అప్పని యుగేందర్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జె. సాయిరామ్ పాల్గొన్నారు. వీరితో పాటు అవోపా ప్రముఖ సభ్యులు పందిరి కృష్ణ, పబ్బా మల్లేశం, దారం మల్లయ్య, బచ్చు రాము, భాస్కర్, కోటోరి ప్రకాష్, బాల రాజయ్య, షీలా కృష్ణ మూర్తి, టి. నరేష్, జి. నరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor