తెలంగాణ · July 13, 2026

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై కదిలిన షాద్ నగర్ ‘టిడబ్ల్యూజేఎఫ్’: పెద్ద ఎత్తున ‘చలో రంగారెడ్డి కలెక్టరేట్’

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి,వి90 న్యూస్,జూలై 13: జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన ‘చలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్’ కార్యక్రమానికి షాద్ నగర్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టే నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు షాద్ నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం నుండి జర్నలిస్టులు భారీగా బయలుదేరారు.టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్, నరేష్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ తరలింపు కార్యక్రమంలో జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజాపాషా (కేపి), జిల్లా కార్యవర్గ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, శ్రీశైలం, నరసింహారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా షాద్ నగర్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయినాథ్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కే. రంగనాథ్ లతో పాటు రాకేష్, కృష్ణ, ధరoపాల్, శివ కుమార్, నరేందర్ గౌడ్, రామకృష్ణ, శ్రీకాంత్, ఆవుల రమేష్, శంకర్, చంద్రశేఖర్ గౌడ్, షకీల్, రియాజ్, ఖాలేద్, శ్యామ్ కుమార్, బూర్గుల రమేష్, మంచలం రమేష్, బండి గోపాల్, సత్యనారాయణ, రవి, రాజు నాయక్ తదితర నియోజకవర్గ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor