అంతర్జాతీయం · July 19, 2026

పీవీ సింధుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 19: జపాన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సింధు తన కెరీర్‌లో తొలి సూపర్-750 టైటిల్‌ను సాధించడం భారత క్రీడా రంగానికి ఎంతో గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన అద్భుతమైన ప్రతిభ, నిరంతర కృషి, పట్టుదలతో దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న పీవీ సింధు భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor