ఆబాది జమ్మికుంటలో ఉచిత వైద్య శిబిరం: ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 21: జమ్మికుంట పట్టణంలోని ఆబాది ప్రాంతంలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ , అమృత న్యూరో హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు నిపుణులైన వైద్యులచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉచిత వైద్య సేవలను గ్రామస్తులు విశేషంగా వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు సభ్యులు ఎగిత సుజాత-అశోక్, 14వ వార్డు సభ్యులు మైసా శిరీష-రవి, బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్ ఆసియా, ఆదిత్య , అమృత హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్క దేవేందర్ రెడ్డిలతో పాటు హాస్పిటల్ సిబ్బంది, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

