తెలంగాణ · July 22, 2026

హనుమకొండలో కాంగ్రెస్, NSUI ఉధృత నిరసన: ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హన్మకొండ,వి90 న్యూస్,జూలై 22: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ , NSUI ఆధ్వర్యంలో అశోక జంక్షన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విరుచుకుపడిన నాయకులు, అశోక జంక్షన్ వద్ద రస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి నశించాలంటూ కాంగ్రెస్, NSUI కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అశోక జంక్షన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor