తెలంగాణ · July 30, 2026

జిల్లేడు చౌదర్‌గూడలోనే పోలీస్ స్టేషన్ కొనసాగించాలి: డీఐజీకి జేఏసీ నాయకుల వినతి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి,వి90 న్యూస్,జూలై 30: రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదర్‌గూడ పోలీస్ స్టేషన్‌ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసి, ఇతర ప్రాంతానికి తరలించవద్దని కోరుతూ జేఏసీ నాయకులు డీఐజీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మచ్చ సుధాకర్ రావు, సయ్యద్ హఫీజ్, పడకంటి వెంకటేష్ మాట్లాడుతూ, జిల్లేడు చౌదర్‌గూడకు సుదీర్ఘ చరిత్ర ఉందని, ఇది వ్యాపార, విద్యా, బ్యాంకింగ్ సేవలకు ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతోందని తెలిపారు. అటువంటి ముఖ్యమైన ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్‌ను వేరే చోటికి తరలించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.పోలీస్ స్టేషన్ తరలింపు నిర్ణయం వల్ల స్థానిక శాంతిభద్రతలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు, నూతన మండల కేంద్రంగా చౌదర్‌గూడ అభివృద్ధి చెందే అవకాశాలు దెబ్బతింటాయని వారు పేర్కొన్నారు. అధికారులు ప్రజల అభిప్రాయాలను, ప్రాంతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌ను ఇక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరిన ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor