కరీంనగర్ · July 31, 2026

యూనిఫాం స్టిచ్చింగ్ లో మెలుకువలు తెలిపిన మెప్మా పీడీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 31: జమ్మికుంటలోని స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్ కేంద్రాలను మెప్మా పీడీ స్వరూప రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జమ్మికుంట, హుజురాబాద్ మెప్మా సంఘసభ్యులు నిర్వహిస్తున్న ఈ కేంద్రాలను స్వయంగా పరిశీలించిన ఆమే, టైలర్లకు పలు కీలక సూచనలు చేశారు. యూనిఫాం కుట్టే ప్రతీ టైలర్ 12 ముఖ్యమైన సూత్రాలను దృష్టిలో ఉంచుకొని, పిల్లలకు నాణ్యమైన దుస్తులను కుట్టి అందించాలని స్పష్టం చేశారు. స్వయంగా కుట్టు మిషన్ పై స్టిచ్చింగ్ చేసి టైలర్లకు మెలుకువలను నేర్పించారు. సంక్షేమ పాఠశాలలకు వెంటనే యూనిఫారాలు అందించాలని, ఆగస్టు 10వ తేదీ నాటికి విద్యార్థులందరికీ యూనిఫామ్‌లు అందేలా చర్యలు తీసుకోవాలని పీడీ ఆదేశించారు.

అనంతరం ఆర్పీలు, ఓబీలతో నిర్వహించిన రివ్యూ సమావేశానికి పీడీ స్వరూప రాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బి.ఎల్.వో విధులు లేని ఆర్పీలు, ఓబీలతో బ్యాంక్ లింకేజ్, కొత్త సంఘాల ఏర్పాటు, చీరల పంపిణీ, ఆధార్ సీడింగ్ వంటి మెప్మా కార్యక్రమాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. వారం రోజుల వ్యవధిలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆర్పీలు పీడీకి హామీ ఇచ్చారు. మళ్లీ నిర్వహించే సమావేశం నాటికి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని పీడీ వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెప్మా డి.ఏం.సి శ్రీవాణి, టి.ఎల్.ఎఫ్ ఓబీలు గీత, జ్యోతి, సి.ఎల్.ఆర్పీలు జ్యోతి, మంజులలతో పాటు పలువురు ఆర్పీలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor