కరీంనగర్ · July 31, 2026

శ్రీ మడేలేశ్వర స్వామి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 31: జమ్మికుంట పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మడేలేశ్వర స్వామి వారి బోనాల పండుగ మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మడేలేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడిపంటలతో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఆలయంలో కొన్ని మరమ్మతు పనులు పెండింగ్‌లో ఉన్నాయని రజక సంఘం నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని చైర్మన్ తెలిపారు. స్వామివారి కృపాకటాక్షాలతో ఆలయ పునర్నిర్మాణ, మరమ్మతు పనులకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు వరంగంటి సదానందం, బూరుగుపల్లి రాములతో పాటు సంఘ సభ్యులు, స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor