సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి: పట్టువస్త్రాలు, బోనం సమర్పణ
సికింద్రాబాద్,వి90 న్యూస్,ఆగస్టు 02: సికింద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం, జగన్మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ లష్కర్ బోనాల జాతర మహోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ (సీతక్క)తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

