కరీంనగర్ · August 3, 2026

వినాయక నగర్ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా దారి మైసమ్మకు ప్రత్యేక పూజలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 03 : జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న దారిమైసమ్మ ఆలయం వద్ద వినాయక నగర్ కమిటీ, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. రహదారులపై వాహనాలు సురక్షితంగా ప్రయాణించాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు సమర్పించారు.
ఈ వేడుకల్లో వినాయక నగర్ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకను ఈ ఏడాది కూడా ఎంతో వైభవంగా నిర్వహించి విజయవంతం చేశారు.

ఈ పూజా కార్యక్రమంలో డాక్టర్ రఘుపతి రెడ్డి, గూడూరి మల్లారెడ్డి, రంగు సత్యనారాయణ, గుండ సదానందం, బజ్జూరి శ్రీనివాస్, యాళ్ల శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి ప్రకాష్, తనుగుల రామారావు, బైరం భాస్కర్, అంబాల శ్రీరామ్, కందికట్ల శ్రీనివాస్, విజయగిరి నాగార్జున, రంగు ప్రవీణ్, క్యాతం ప్రకాష్, పెండెం అవినాష్, తడం రమేష్, బుర్ర మల్లికార్జున్, అంబాల రఘు, ప్రవీణ్, బబ్బులు, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor