కరీంనగర్ · August 3, 2026

జమ్మికుంటలో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 03: జమ్మికుంట మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జమ్మికుంట మండల ఇన్చార్జి తునికి వసంత్ మాదిగ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలు, మండల కమిటీల ఏర్పాటుతో పాటు జెండా గద్దెల నిర్మాణం వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాబోయే సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పటిష్టమైన ప్రణాళికతో అత్యంత వైభవంగా విజయవంతం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రాంచెంద్రం మాదిగ, రాష్ట్ర నాయకులు మారపెల్లి శ్రీనివాస్ మాదిగ, కేశవపట్నం మండల ఇన్చార్జి దేవునూరి రవీందర్ మాదిగ, హుజూరాబాద్ మండల ఇన్చార్జి ఎర్ర ఆదిత్య మాదిగ, సైదాపూర్ మండల ఇన్చార్జి మిట్టపల్లి రాజేష్ మాదిగతో పాటు మోలుగూరి అశోక్ మాదిగ, మోతే మహేందర్ మాదిగ, మోతే స్వామి మాదిగ, దొడ్డే అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor