విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 03: జమ్మికుంట పట్టణ పరిధిలోని వినాయక గార్డెన్స్‌లో విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (వోపా) హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు కట్ట నాగభూషణాచారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఇంటర్మీడియట్‌కు చెందిన ఏడుగురు, పదో తరగతికి చెందిన 17 మంది విద్యార్థులు తమ ఉత్తమ ప్రతిభకు గాను పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలు అందజేసిన అనంతరం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), రాష్ట్ర వోపా కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి, కో-కన్వీనర్ కట్ట విష్ణువర్ధన్, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి రాష్ట్ర కోశాధికారి కాసుల కిరణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, 28వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు రమేష్, 8వ వార్డు కౌన్సిలర్ సురేష్, ఉపాధ్యక్షులు మామిడోజు సదానందాచారి మాట్లాడారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ‘వోపా’ ఇలా పురస్కారాలు అందించడం శుభ పరిణామమని ప్రశంసించారు.

సాధారణ కుటుంబాల నుంచి వచ్చే ఆణిముత్యాలను వెలికితీసి ఉన్నత చదువులకు ప్రోత్సహించడం ద్వారా వారు భావితరాలకు దిక్సూచిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ విజయగిరి తులసిదాస్, ఉపాధ్యక్షులు తాటికొండ భద్రాచారి, కోశాధికారి రంగు ప్రశాంత్, జూపాక శ్రీనివాస్, ఉమ్మడి సురాచారి, కటుకోజ్వల సదానందం, శ్రీరామోజు మహేంద్రచారితో పాటు పలువురు నాయకులు, బాధ్యులు పాల్గొన్నారు.

