కరీంనగర్ · August 6, 2026

బీఎస్పీ నాయకుడి కూతురుని పరామర్శించిన సామాజిక వేత్త సబ్బని వెంకట్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/సైదాపూర్,వి90 న్యూస్,ఆగస్టు 06: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బహుజన్ సమాజ్ పార్టీ సైదాపూర్ మండలానికి చెందిన కొయ్యడ మధు యొక్క కూతురు అక్షర (8 సంవత్సరాలు) అదే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె కుడి చెయ్యి, కుడి కాలు విరిగి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.విషయం తెలుసుకున్న సామాజిక వేత్త సబ్బాణి వెంకట్ ఆసుపత్రిని సందర్శించి పాపను పరామర్శించారు. అనంతరం ఎంజీఎం సూపరింటెండెంట్ తో, వైద్యులతో మాట్లాడి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

వైద్యులు పాపకు ఒక శస్త్రచికిత్స (ఆపరేషన్) పూర్తి చేశారు. వైద్య పరీక్షల ఆధారంగా మొదటి నుంచి చివరి వరకు అవసరమైన B-negative రక్తాన్ని డొనేషన్ ద్వారా అందించడం జరిగింది.కొయ్యడ మధు కుటుంబం అత్యంత పేద కుటుంబం కావడంతో సామాజిక వేత్త సబ్బాణి వెంకట్ తన ఉదారతను చాటుకుంటూ ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. అలాగే బాధితురాలికి సంబంధించిన తదుపరి అవసరాలను దగ్గరుండి చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor