తెలంగాణ · August 7, 2026

కమలాపూర్ మండలంలో 402 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధం: ఏఎంసీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హన్మకొండ/కమలాపూర్,వి90 న్యూస్, ఆగస్టు 07: హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బాబు చొరవతో కమలాపూర్ మండలంలో నిర్మించిన 402 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నో రోజులుగా లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్న ఈ గృహ పంపిణీకి సంబంధించి ప్రక్రియ వేగవంతమైంది.ఈ నేపథ్యంలో కమలాపూర్, గూడూర్, మర్రిపల్లిగూడెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇళ్లను హన్మకొండ ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఇళ్ల పంపిణీకి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ల చేతుల మీదుగా ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా వోడితల ప్రణవ్ బాబు ప్రత్యేక కృషి చేస్తున్నారు.సొంతింటి కలను నెరవేర్చుకోబోతున్న 402 మంది నిరుపేద లబ్ధిదారుల తరఫున కమలాపూర్ ఏఎంసీ చైర్మన్ తవుటం ఝాన్సీ రవీందర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు , వోడితల ప్రణవ్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, స్థానిక ఎంపీడీవో గుండె బాబు, తహసిల్దార్ సురేష్, సర్పంచులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాని రమేష్, పుల్ల శోభన్, ఆట్ల కళ్యాణ్, పాక చంద్రమౌళి, భాషబోయిన రమేష్, మనీష్, నవీన్, రాజు, శివానందం, చందబోయిన సాయికుమార్, రామకృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor