కరీంనగర్ · August 7, 2026

జమ్మికుంటలో ఘనంగా ఆరోగ్యశ్రీ దినోత్సవం: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలమే ఈ పథకం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 07: జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల ఇన్చార్జి తునికి వసంత్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో తునికి వసంత్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గత మూడు దశాబ్దాలుగా సమాజంలోని అన్ని వర్గాల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. నిరుపేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 2004లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందని గుర్తుచేశారు. ఆయన చేసిన పోరాట ఫలితాలు, సాధించిన విజయాలు నేడు ప్రతీ పేద ఇంటికీ ఫలాలను అందిస్తున్నాయని వివరించారు.ఈ వేడుకల్లో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మారేపల్లి శ్రీనివాస్, హుజురాబాద్ మండల ఇన్చార్జ్ ఎర్ర ఆదిత్య, కనగర్తి సర్పంచ్ రామంచ సంపత్, నాయకులు ముంజల రాజేష్ గౌడ్, దొడ్డ అనిల్, రామంచ రాజు, రాచపల్లి సమ్మయ్య, జీడి మోహన్, రాచపల్లి వంశీ, ఎర్ర జస్వంత్ సాయి, పూరెల్ల రాహుల్, తౌడం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor