చేనేత కార్మికులకు స్వీట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

0
1006370523

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 07: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు కొత్తపల్లిలోని బాలాజీ చేనేత సహకార సంఘాన్ని సందర్శించి చేనేత కార్మికులకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కొక్కుల రాజేంద్రం , విద్యార్థులు కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రాజేంద్రం మాట్లాడుతూ చేనేత రంగానికి ఉన్న ప్రాముఖ్యతను, భారత స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఈ రంగం వహించిన విశిష్ట పాత్రను వివరించారు. ప్రస్తుత కాలంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్లను, కార్మికుల సామాజిక , ఆర్థిక స్థితిగతులను విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు సంపత్, మేనేజర్ సత్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *