సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి,వి90 న్యూస్,ఆగస్టు 15: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎమ్‌డీఏ) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన దేశ మాజీ ప్రధాన మంత్రులు స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, స్వర్గీయ రాజీవ్ గాంధీల విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.ఈ ఆవిష్కరణ మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో పాటు పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ పురోగతికి, ఆధునిక భారతదేశ నిర్మాణానికి మాజీ ప్రధానులు అందించిన సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.

